వనపర్తి: వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ధరణి కేజీబీవీ భవనంపై నుంచి కిందికి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఆమెను హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ నిమ్స్‌కు సిఫారసు చేశారు. వనపర్తి మండలం కృష్ణగిరికి చెందిన ధరణి.. ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.