ములుగు, జనవరి 29(నమస్తే తెలంగాణ) : ఆదివాసీ జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి బయలెల్లిన సమ్మక్క తల్లిని దారిపొడవునా సంప్రదాయ నృ త్యాలు, కోయదొరల డోలు వాయిద్యాల మో తలు, శివసత్తుల పూనకాలతో భక్తజనం ఎదురేగి ఆహ్వానించగా.. పోలీసుల తుపాకీ వందనంతో స్వాగతం పలికిన ఉద్విగ్న క్షణాన గురువారం గద్దెపై కొలువుదీరింది. రెండేండ్ల నిరీక్షణ తర్వాత మేడారం చేరిన వనదేవతకు భక్తకోటి ప్రణమిల్లింది. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ వడ్డెలు సమ్మకను గద్దెలపైకి రాత్రి 9.45గంటలకు తీసుకొచ్చారు. సాయం త్రం నాలుగు గంటల కు మొదలైన ఈ అద్భు త ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడం తో చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు జనప్రవాహంతో పోటెత్తింది.
సమ్మకను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రి య గురువారం ఉదయమే మొదలైంది. వడ్డె లు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వెదురు కర్రలు తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక పూజా మందిరం నుంచి అడేరాల(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మకను గద్దెపైకి తెచ్చేందు కు వడ్డెల బృందం సాయంత్రం 4గంటలకు చి లుకలగుట్టపైకి బయలుదేరింది. అప్పటికే చి లుకలగుట్ట ప్రాంతమంతా భక్తులతో నిండిపో గా, దారి పొడవునా పసుపు, కుంకుమల ము గ్గులు వేసి సమ్మక రాక కోసం చూస్తుండిపోయారు. సమ్మకని తోడ్కొని ప్రధాన పూజారి కొకెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక ఉదుటున చిలుకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను అనుసరించగా, సమ్మక రాకకు సూచనగా ప్రభుత్వ అధికారిక లాంచనాల ప్ర కారం ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిగి వందనం పలికారు.

మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర సమ్మక్కకు సాదర స్వాగతం పలికారు. సమ్మక రాకను సూచించే ఈ శబ్దం తో ఒకసారిగా చిలుకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య పూజారుల బృందం సమ్మకను గద్దెలపైకి తీసుకెళ్లారు. దారిపొడవునా సమ్మకకు ఎదురుకోళ్లు, గొర్రెలను బలిచ్చి మొకులు చెల్లించుకున్నారు. మొదట మేడారంవాసులు, జిల్లా అధికారులు మొకులు చెల్లించుకున్నారు. నలుగురు వనదేవతలు.. సమ్మక, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరడంతో మొకులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సమ్మక గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక రోజే ఏకంగా 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. మేడారం అటవీ ప్రాంతం ఎకడ చూసినా జనంతోనే నిండిపోయింది. శుక్రవారం సైతం భారీగా వచ్చే భక్తులతో మేడారం ప్రాంతం కికిరిసిపోనుంది. దర్శనానికి సగటున గంటన్నర నుంచి 2గంటల సమయం పడుతున్నది.