హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున స్వామివారి దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహూకరించారు. అంతకుముందు టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు వారికి ఆహ్వానం పలికారు. శ్రీవారి దర్శనానంతరం తిరుగుప్రయాణంలో శ్రీకాళహస్తి ముక్కంటిని దర్శించుకున్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన సీఎం కుటుంబ సభ్యులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం దక్షిణామూర్తిని దర్శించుకున్నారు. ఆలయ పూజరులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.