సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను సంక్షేమ బాటలో పరుగులు పెట్టించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతో చేపట్టిన మహత్తరమైన ప్రాజెక్టులు మహాద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆరు దశాబ్దాలు ఉపాధి కరువై వలసలు పోయిన తెలంగాణ జనాల కండ్లల్లో ఆనందం చూడాలని, మన రాష్ట్రంలోనే పుష్కలమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కేసీఆర్ స్వప్నం సాకారమవుతున్నది.
ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.. వరంగల్లో సిద్ధమవుతున్న టెక్స్టైల్ పార్క్. ఇక్కడ అందుబాటులోకి రానున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన కిటెక్స్ పరిశ్రమ.. ఎలా ఉంటుందో చూపించేందుకు వీలుగా తొలిసారి అక్కడి చిత్రాలు బయటకు వచ్చాయి. పారిశ్రామిక ప్రగతిలో కేసీఆర్ పాలన ఏం కలలుగన్నదో, ఏం సాధించిందో నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు వచ్చిన కేటీఆర్కు స్వాగతం పలుకుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

కిటెక్స్ పరిశ్రమలోని దారం బెండలను సిద్ధం చేసే స్పిన్నింగ్ యూనిట్

వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కిటెక్స్ వస్త్ర పరిశ్రమలో ఏర్పాటు చేసిన మిషనరీ

కిటెక్స్ పరిశ్రమలో స్పిన్నింగ్ యూనిట్ నుంచి దారం ప్యాక్లను తరలించే యూనిట్

కిటెక్స్లో ఉత్పత్తి చేసిన వస్ర్తాలను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న బాక్సులు