BRS | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇప్పటిదాకా వెలువడిన సర్వేలు ఏవైనా బీఆర్ఎస్దే విజయం.. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టం చేశాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వేకూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ‘బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా’ అని తేల్చేసింది. ఈ నెల 30న రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతున్నది? ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నవి? తదితర అంశాలపై తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) సర్వే చేపట్టింది. ఈ బృందం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు సేకరించింది. అంశాలవారీగా క్షేత్రస్థాయిలో పలు వివరాలు సేకరించి, అన్ని విషయాలను క్రోడీకరించి తుది నివేదికను రూపొందించింది. బీఆర్ఎస్ పార్టీ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నదని సర్వేలో తేలింది.
40శాతం మంది కేసీఆర్‌కే మద్దతు
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారని సర్వేలో తేలింది. 64 నుంచి 68 సీట్లతో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించనున్నదని వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతానికిపైగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ విజనరీని కోరుకుంటున్నట్టు తేలింది. అధికారంలోకి రాబోతున్నామని పగటి కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ 34 నుంచి 38 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడైంది. బీజేపీ పార్టీ సింగిల్ డిజిట్‌లోపు సీట్లనే గెలుస్తుందని, కేవలం 5 నుంచి 6 సీట్లకే పరిమితం అవుతుందని సర్వేలో తేలింది. ఎంఐఎం ఎప్పటిలాగే 6 నుంచి 7 సీట్లలో విజయం సాధించబోతున్నదని, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 1 నుంచి 2 సీట్లకు పరిమితం అవుతుందని వెల్లడయ్యింది. రాష్టవ్యాప్తంగా 1 నుంచి 2 సీట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నదని టీజేఎఫ్ సర్వే స్పష్టం చేసింది.
టీజేఎఫ్ సర్వే వివరాలు పార్టీ రాబోయే అసెంబ్లీ సీట్లు