హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు రాలేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చెప్పినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎండ వేడిమి, అనారోగ్య కారణాలతో సోనియా రాలేకపోతున్నారని తెలిపాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆమెను వేడుకలకు ఆహ్వానించారు. ఉత్సవాలకు రాలేకపోతున్నప్పటికీ తెలంగాణ ప్రజలకు సోనియా వీడియో సందేశం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందేశాన్ని వేడుకల సమయంలో ప్రదర్శించనున్నారు.