అక్కన్నపేట, జూన్ 11: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అంతులేని వివక్ష, నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా సాగునీటి రంగం తీవ్ర అన్యాయానికి గురైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్‌ను అతి త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. శనివారం ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ శంకర్‌తో కలిసి ఆయన గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించారు. తెలంగాణ సాధించిన తరువాత సీఎం కేసీఆర్ దూరదృష్టి, పరిపాలనా దక్షతతో సాగునీటి రంగంలో అ ద్భుత పురోగతి సాధించి చరిత్ర సృష్టించారన్నారు.