యాదాద్రి భువనగిరి : తెలంగాణకు కేసీఆర్ ( KCR ) నాయకత్వమే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితాపై భువనగిరి ( Bhuvanagiri ) నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది.
ఈ సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ వచ్చేది బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ సాధకుడిగా, పదేళ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ గొప్పదనం ప్రజలందరికీ అర్థమయిందని అన్నారు.ఓటర్ జాబితా సవరణ అనేది ఓట్ల వడబోత కార్యక్రమమని,బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. రైతులు అడుగడుగునా మోసపోయారు.ఇప్పటికీ యాదాద్రి జిల్లా లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు.తడిసి మొలకలు వస్తున్నాయని ఆందోలన వ్యక్తం చేశారు.
హ్యాం రోడ్ల పేరుతో దోపిడీకి స్కెచ్

ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సొమ్మును దోచుకొని దాచుకుంటున్నారని ఆరోపించారు. హ్యాం రోడ్ల పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారని,10 రూపాయల ఖర్చుతో చేసే పనిని 50 రూపాయలతో చేస్తూ వందల కోట్లు కమిషన్లు దోచుకు తింటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాం రోడ్ల పేరుతో జరుగుతున్న దోపిడిపై విచారణ చేపిస్తామని వెల్లడించారు.హ్యాం రోడ్ల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ బూత్ లు పెట్టె ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగడం లేదు.జిల్లా మంత్రులు పదవులను అనుభవిస్తున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, చింతల వెంకటేశ్వర రెడ్డి,జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.