హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతీని నియమిస్తూ సీఎస్ సంజయ్ జాజు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2005 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అవినాష్ మహంతీ ప్రస్తుతం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయనకు అదనంగా టీజీ సేఫ్ కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ప్రభుత్వం తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ను విలీనం చేసి టీజీసేఫ్ పేరుతో ఒకే పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ రెండు విభాగాల నియంత్రణను కమిషనర్‌కు అప్పగించింది.