హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేనని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏపీలో మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాలను అణగదొక్కడం, మితిమీరిన పబ్లిసిటీ తప్ప చంద్రబాబు చేసిందేమీలేదని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తీరును ఎండగట్టారు. హైప్ క్రియేషన్లో చంద్రబాబు ఆద్యుడని, ఏపీకి పెట్టుబడులు నిజమైతే రూ.20 లక్షల కోట్లు వచ్చి ఉండాలె అని చురకలు అంటించారు.