హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి(Diwali) పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సీఎం కేసీఆర్ప్రజలకు ఉద్బోధించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరిసంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.