KCR | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.