హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 19( నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకున్నారు. రెన్యూవల్లో భాగంగా కేసీఆర్ దంపతులు బుధవారం సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి విచ్చేశారు.
హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ ఆధ్వర్యంలో వేలిముద్ర, సంతకం, ఫొటో తదితర ప్రక్రియలను పూర్తి చేశారు. కాగా, కేసీఆర్ వచ్చారనే విషయం తెలుసుకున్న అభిమానులు భారీఎత్తున పాస్‌పోర్టు కార్యాలయానికి చేరుకున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. కేసీఆర్ వెంట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.