హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం గాయపడ్డాడు. (Minory Injury) విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడిని(హిమాన్షు) పరామర్శించేందుకు ఏఐజీ హాస్పిటల్‌కు రానున్నారు. కాగా, హిమాన్షు గాయంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. హిమాన్షుకు స్వల్ప గాయం మాత్రమే అయిందని, ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని కేటీఆర్ తెలిపారు.
మరికొద్ది రోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకుని, మళ్లీ సాధారణ స్థితికి వస్తారని పేర్కొన్నారు. హిమాన్షు ఆరోగ్యంపై ఆందోళనతో ఫోన్లు, మెసేజ్‌లు చేసి తమపై ప్రేమ, అభిమానాన్ని చాటుకున్న ప్రజాప్రతినిధులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.