బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీచేస్తుండటంతో ఈ 2 నియోజకవర్గాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాక పట్ల కామారెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి మనోగతం ఏమిటి? గతంలో కేసీఆర్‌కి కామారెడ్డితో ఉన్న అనుబంధం ఏమి టి? కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలేమిటి? తదితర అంశాలపై ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో కామారెడ్డితోపా టు సమీప మండలాల్లోని గ్రామాల ప్రజల మ నోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఒడిసిపట్టే ప్ర యత్నం చేసింది. కామారెడ్డి, భిక్కనూరు, దొ మకొండ మండలాల్లో పర్యటించిన ‘నమస్తే తెలంగాణ’ బృందం గ్రౌండ్ రిపోర్ట్.
‘కేసీఆర్‌ను తట్టుకునుడు కష్టం.. ఆయన పోటీ చేస్తున్నడంటే అందరూ సంబురంగా ఫీలవుతున్నారు.. ఇక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వే ల్ మాదిరిగానే మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది’.. ఇదీ కామారెడ్డి ని యోజకవర్గంలోని ఏ మూలకు వెళ్లినా వినిపిస్తున్న మాట. ‘కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీచేస్తున్నడు అనంగనే భూములకు బయానా తీసుకున్నవాళ్లు తిరిగి ఇచ్చేస్తున్నరు’ అని ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి పేర్కొనడం కేసీఆర్ గెలుపుపై ఉన్న అంచనాలు, అక్కడ జరగబో యే అభివృద్ధిపై స్థానికులకు ఉన్న విశ్వాసాన్ని సూచిస్తున్నది.
పండుగ షాపింగ్‌కు వచ్చినోళ్లు కేసీఆర్ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారంటూ బట్టల షాపు నిర్వాహకురాలు చేసిన వ్యాఖ్య నియోజకవర్గం మూడ్‌కు అద్దం పడుతున్నది. పింఛన్ రాకపోతే మా అమ్మ ఇంతకా లం బతికేదే కాదని ఓ మహిళ చేసిన వ్యాఖ్య ఆయా వర్గాల్లో కేసీఆర్ పట్ల గూడుకట్టుకున్న కృతజ్ఞతాభావాన్ని ప్రతిబింబిస్తున్నది. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడమే ఆలస్యం ఆయన నిర్ణయా న్ని స్వాగతిస్తూ అనేక గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. క్షేత్రస్థాయిలో కేసీఆర్ పట్ల అన్ని సామాజికవర్గాల్లో సానుకూలత కనిపిస్తున్నది. పల్లె ప్రాంతాలు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు జైకొడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ ‘కేసీఆర్ వస్తే.. కామారెడ్డి బాగుపడుతుంది’ అనే ఆశాభావం బలంగా వ్యక్తమవుతున్నది. మహిళలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, అభివృద్ధి కాముకులు ఇలా విభిన్నవర్గాల ప్రజలు కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
‘కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ చాలా ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిండు. వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటడు. కానీ, అభివృద్ధి ఉండదు. బీజేపీ నుంచి పోటీచేస్తానంటున్న వ్యక్తి కుల సంఘాలకు కమ్యూనిటీ హా ళ్లు, గుడులకు విరాళాలు ఇస్తున్నడు. కానీ, బీజేపీకి జనంలో బలం లేదు. వీళ్లేవ్వరూ కేసీఆర్‌తో సరితూగలేరు’ అంటూ మధ్యతరగతికి చెందిన ఒక వ్యాపారి విశ్లేషించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ సహా ఇతర పార్టీలు బీఆర్ఎస్ ఓటుబ్యాంకును చీల్చేందుకు పదుల సంఖ్య లో అభ్యర్థులను రంగంలో దింపి ప్ర యోజనం పొందాలని చూస్తున్నాయని, అలాంటివి పనిచేయవని చర్చించుకుంటున్నారు. ‘50 ఏం డ్లు పాలించిన కాంగ్రెస్ కామారెడ్డికి ఏం చేసింది? కేసీఆర్ వచ్చినంక జిల్లా చేసిండు. మెడికల్ కాలేజీ పెట్టిండు’ అనే చర్చ జరుగుతున్నది. ‘సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తదితర నియోజకవర్గాలు అద్భుత ప్రగతి సాధించాయి. కేసీఆర్ పోటీ చేస్తే 3 జాతీయ రహదారులను ఆనుకొని ఉన్న కామారెడ్డి అభివృద్ధి అయితదని ఊళ్లల్లో చర్చ జరుగుతున్నది’ అని ధూమల మధు అనే యు వకుడు చెప్పడం ప్రజల నాడిని సూచిస్తున్నది.
పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనను, గత పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారు. యాభై ఏండ్ల నీళ్ల కష్టాలు తీర్చి, కరెంట్ వెలుగు తెచ్చింది కేసీఆరేనని పార్టీలకు అతీతంగా కొనియాడుతున్నారు. మహిళలు తాము మంచినీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిపోయిన రోజులు, చేతిపంపులతో చేతులు నొప్పి పుట్టిన రోజులు, వాటర్ ట్యాంకర్ల దగ్గర కొట్లాటలు, ఘర్షణలను గుర్తు చేసుకుంటున్నారు. కరెంట్‌లేక ఎండిన పంటలను, కాలిన మోటర్లను మరువలేకపోతున్నారు. మంచి పాలనకే మద్దతు ఇస్తామని చెప్తున్నారు.
కేసీఆర్‌తోనే కామారెడ్డి అభివృద్ధి సాధ్యమన్న భావన ప్రతిపక్షపార్టీల కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతుండటం వి శేషం. ‘కేసీఆర్ వస్తే కామారెడ్డి మస్తు అభివృద్ధి అయితది. అందులో డౌట్‌లేదు’ అని కామారెడ్డి పట్టణానికి చెందిన ఒక బీజేపీ కార్యకర్త పేర్కొనడం ప్రజల మూడ్‌ను సూచిస్తున్నది. ‘కేసీఆర్ బాగా చేస్తున్నడు. ఇక్కడి నుంచి పోటీచేస్తానంటే మిగితా వాళ్లు ఆలోచిస్తున్నరు. కానీ కేసీఆర్ ఇక్కడ ఉండరట.. కదా’ అని సలీం అనే యువకుడు అనుమానం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాగా అవతరించడం, మెడికల్ కాలేజీ రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్‌తోనే మరింత అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. ‘కామారెడ్డి కా నామ్ బహుత్ హై.. మగర్ కామా కమ్హై. అబీ కేసీఆర్ సాబ్ ఆరే బోర్లే ఆయేతో బహుత్ అచ్ఛా కామ్ చల్తాహై’ అని బైక్ మెకానిక్ గుల్షన్పాషా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో కేసీఆర్ కామారెడ్డిని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారనే విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
మళ్ల్లా కేసీఆరే అస్తడు. అందరి కడుపు ఇసారిచ్చిండు. అన్నంపెట్టినోళ్లకు సున్నం పెట్టరు జనం. 250 యూనిట్ల కరెంట్ ఫ్రీతోని కరెంట్ ఇస్త్రీపెట్టె తెచ్చుకున్నం. బొగ్గులపెట్టె వజన్ ఎక్కువ. ఇప్పుడు కరెంట్ పెట్టె అల్కగ ఉంటది. చేతులకు అలసట ఉండదు. బొగ్గులపెట్టెతోని ఇస్త్రీ చేసేటప్పుడు మిరుగులు పడి బట్టలు ఖరాబ్ అయ్యేది. తెల్లబట్టలకు మరకలు అవుడు, చీరెలు కాలిపోవుడు ఉండేది. అప్పుడప్పుడు దండుగ కట్టేది. మాటలు పడేది. కేసీఆర్ కడుపు సల్లగుండ తిప్పలు తీర్చిండు.
– సావిత్రి, లాండ్రిషాప్ నిర్వాహకురాలు
కామారెడ్డిలో కేసీఆర్‌సార్ నిలబడతడు అంటే అందరికీ సంబురంగా ఉన్నది. పండుగ బట్టలు కొనేందుకు వచ్చినోళ్లు బేరం చేసుకుంటూ కేసీఆర్ గురించే ముచ్చట పెడ్తున్నరు. మాక్కూడా కేసీఆరే రావాల్నని ఉన్నది. మంచి పనులు చేస్తుండు. నాకు అన్నదమ్ముల్లేరు. నేనొక్కదాన్నే. మా అమ్మకు నెలకు రెండువేలు పింఛన్ వస్తున్నది. మాకు భూమిలేదు. జాగలేదు. నాన్నలేడు. ఆ పైసలు రాకపోతే ఆమె ఇంతకాలం బతికేదే కాదు. పింఛన్ పైసలు ధైర్యాన్ని ఇస్తున్నవి. మళ్లా కేసీఆరే వస్తడు. అందరికి అన్నీ చేస్తున్న కేసీఆర్‌ను ఎవరూ కాదనరు.
-సునీత, క్లాత్మార్చంట్ నిర్వాహకురాలు
కేసీఆర్ వద్దంటే కరెంట్ ఇత్తాండు. యాభై ఏండ్ల కాంగ్రెసోడు ఏం చేసిండు? ఏం చేయలే. కాంగ్రెసోడు రెండు వందల పింఛన్ చేసిండు. ఏమిట్లకు ఏమైతది? కేసీఆర్ రెండువేలు ఇత్తుండు. ఇప్పుడు ఐదు వేలు చేస్తడట. కుంటోళ్లకు, గుడ్డోళ్లకు ఇప్పటికే నాలుగువేలు చేసిండు. ఆడపిల్ల పెండ్లికి పైసలు ఇచ్చిండు. దవాఖాన్ల పిల్లపుడితే వేలకు వేలు ఇస్తుండు. లావని భూములు కూడా పట్టా కావాల్నని అనుకుంటున్నరు. కామారెడ్డిలో కేసీఆరే దిగితే కండ్లపండుగ లెక్క గెలిపిత్తరు. కేసీఆర్ దిగితే తట్టుకునుడు కష్టం. కాంగ్రెస్ కాదు.. ఎవల్తోని కాదు. కేసీఆర్ వస్తే ఎవలు నెగ్గలేరని లోకం అంటుంది.
-గొర్ల భిక్షపతి, దొమకొండ
నేను బీడీలు చేస్తా. మా బీడీ కార్మికులను ఎవలు పట్టిచ్చుకోలె. కేసీఆర్ పట్టిచ్చుకున్నడు. అడగకుండానే మాకు రెండువేల పింఛన్ ఇచ్చిండు. ఇప్పుడు మల్ల పెంచుత అంటున్నడు. ఇదివరకు మంచినీళ్లకు మస్తు తిప్పలు పడేది. ఎక్కడికెక్కడికో పోయి నీళ్లు మోసేది. మోసి, మోసీ భుజాలు కాయలు కాసినయి. బోర్లు కొట్టి కొట్టీ చేతులు నొచ్చేది. ఇప్పుడా గోస తప్పింది. నా బిడ్డకు కల్యాణక్ష్మి వచ్చింది. కేసీఆరే మల్ల వస్తడు. మాకు ఇల్లు వస్తది.
-ప్రమీల, బీడీ కార్మికురాలు
కేసీఆర్ వస్తే ఇంకింత డెవలప్ అయితది. కామారెడ్డిలో ఇప్పటిదాకా అయింది ఒకెత్తు, కేసీఆర్ వత్తే ఇంకొకెత్తు. ఇద్వరకు కరెంట్ 4 గంటలు ఉంటే మహా ఎక్కువ. ఇప్పుడు 24 గంటల కరెంట్. అట్ల కరెంట్ ఇచ్చుడు ఎవల్తోనైనా అయిద్దా? కేసీఆర్ కాకుంట ఎవల్తోని కాకపోయ్యేది. కాంగ్రెసోళ్లతోని, బీజేపోళ్లతోని పనులు జేసుడు కానేకాదు. హండ్రెడ్ పర్సెంట్ కేసీఆరే మళ్లీ గవర్మెంట్లకు వస్తడు. కామారెడ్డిని బాగుచేస్తడు.
-రమేశ్‌గౌడ్, స్క్రాప్ వ్యాపారి
రైతులు కరెంట్‌తోని బతుకుతున్నరు కేసీఆర్ నీళ్లు తెత్తుండు. ఏ ప్రధానమంత్రితోని కాలే నీళ్లు తెచ్చుడు. తెలంగాణ వచ్చినంక బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తుండు. కాంగ్రెస్సోళ్లు మస్తుగంటరు. నేను కూడా మస్తు మాటలు చెప్త. అయిద్దా? కేసీఆర్ అన్ని కులాలకు అన్ని జేసిండు. 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. మూడు గంటల కరెంట్ సరిపోద్ది అంటారే కాంగ్రెసోళ్లు. ఈ సంవత్సరం కాలమే కాలేదు. కరెంట్‌తోనే రైతులు బతుకుతున్నరు. అన్నంపెట్టినోడే అయ్య. ఆపతికి ఆదుకున్నోడికే ఓటు.
-రాజయ్య, దొమకొండ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయం. గతంలో చంద్రబాబు ఆర్టీసీని చంపాలని చూసిండు. కేసీఆర్ దాన్ని బతికిచ్చిండు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నోరోజులు కష్టపడ్డా కాలేదు. ఇప్పుడు అయినందుకు సంతోషంగా ఉన్నది. కేసీఆర్‌కు ఓటేస్తే కామారెడ్డి అభివృద్ధి అయితదని అనుకుంటున్నరు జనమంతా.
-కేఎన్ చారి, ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్
యాభై ఏండ్లు నీళ్ల కోసం తిప్పల పడ్డం. చేతిపంపు కొట్టికొట్టీ చేతులు పోయేది. కేసీఆర్ నీళ్ల తిప్పలు తీర్చిండు. నా బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి పైసలొచ్చినయి. ఏడాది కింద నా భర్త చనిపోయిండు. రైతుబీమా వచ్చింది. నాకు ఇద్దరు కొడుకులు. ఒకడు దుబాయ్‌ల ఉంటడు. ఇంకొకడు ఇక్కడే (కామారెడ్డి) ఉంటడు. సద్దితిన్న రేవు తలవాలె. అందుకనే కేసీఆర్ దిక్కే ఎక్కువమంది ఉన్నరు.
-కళావతి, కామారెడ్డి
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి బ్రిగేడియర్‌గా వ్యవహరించిన విషయాన్ని ఇక్కడివాసులు గుర్తుచేసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లల్లో ఉద్యమవ్యాప్తికి పార్టీ నిర్మాణం కీలకమని భావించి ప్రతి మండలానికి ఒక బ్రిగేడియర్‌ను నియమించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి మండలానికి బ్రిగేడియర్‌గా బాధ్యతలు స్వీకరించి మండలంలోనే రెండు రోజులు బసచేశారని నర్సింగరావు గుర్తుచేసుకున్నారు. మండలంలో నాడు ఉన్న 18 గ్రామ పంచాయతీలకు పార్టీ గ్రామ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు ఆయనే స్వయంగా దగ్గరుండి వేశారని చెప్పుకుంటున్నారు.
ఉద్యమ నిర్మాణంలో భాగంగా బహిరంగసభల నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు పార్టీ అధినేత మొదలు కార్యకర్తలు కూలిపని చేయాలని నిర్ణయించారు. తద్వారా ఉద్యమ ఆకాంక్షను ప్రతి ఒక్కరిలో పాదుకొల్పాలనే సంకల్పంతో కేసీఆర్ కామారెడ్డి పట్టణంలోని బాంబే క్లాత్హౌస్, దేశాయి బీడీవర్క్స్లో కూలిపనిచేసి నిధులు సమకూర్చారని పట్టణవాసులు యాది చేసుకొంటున్నారు.
ఉద్యమకారులపై ఉమ్మడి రాష్ట్రంలో రౌడీషీట్లు, పీడీయాక్ట్‌లు, రైల్వేకేసులు వేలాదిగా నమోదయ్యాయి. తెలంగాణ ద్రోహులపై చెప్పులు విరిసిన తొలిగడ్డ కూడా కామారెడ్డేనని ఉద్యమకారులు గుర్తుచేసుకుంటున్నారు. కామారెడ్డిలో నిర్వహించిన నిరసన సందర్భంగా ఉద్యమకారులు రెండు బస్సులకు నిప్పు అంటించారు. కొమ్ముల తిరుమల్రెడ్డితోసహా 11 మంది ఉద్యమకారులు 14 రోజులు జైలు శిక్షను అనుభవించారని గుర్తుచేసుకుంటున్నరు.