KCR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సం ఘనంగా నిర్వహించారు. రజతోత్సవ ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు సాదరస్వాగం తెలిపారు.
అనంతరం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, మధుసూదనచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు.