హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఎంవోయూలు, పెట్టుబడులన్నీ ఉత్త బోగస్ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు కథే నిదర్శనమని ఉదహరించారు. స్టార్ హోటళ్లలో ఉండే వంట మనుషులు, సప్లయ్ చేసేటోళ్ల తో సంతకాలు పెట్టించి, ఎంవోయూలు కుదిరి టనట్టు గప్పాలు కొట్టారని తూర్పారబట్టారు. గతంలో చంద్రబాబు చెప్పుకున్న ఎంవోయూలన్నీ సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పటికే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవని చెప్పారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే కథ నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. ఆదివారం కేసీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
రాష్ట్రంలో మొన్న రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినయట. నేను పేపర్లో చూ సిన. ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం వంచిస్తరు? రియల్‌గా కాంక్రీట్ టర్మ్స్‌లో రా వాలె. కృషి చేస్తే నిజంగనే తన్లాడాల. మా గవర్నమెంటు వచ్చిన్నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉండె. దాన్ని రూ.2.47 లక్షల కోట్ల వరకు తీసుకుపోయినం. స్టెప్ బై స్టెప్ చేసుకుంటు పోయినం. గాల్లో మాటలు చెప్తే వస్తయా? బెస్ట్ పాలసీ తెస్తే ఆటోమెటిక్గనే అట్రాక్ట్ అయి వస్తరు. అప్పుడు ఒకాయన ఉండే.. ఆయన చీఫ్ సెక్రటరీ అయి రిటైర్ అయిండు. మాధవరావు అల్లుడు ప్రదీప్‌చంద్ర. ఆయనకు పాలసీ చేయాలని చెప్తే.. చాలా దేశాల నుంచి తెప్పిచ్చిండు. 50సార్లు చెక్ చేసిన. ఇట్లకాదు.. నాకు కాంక్రీట్గ కావాలి. ఇంకా మంచిగ కావాలి అన్న. చాలా కష్టపడి చేసిండు. ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ది బెస్ట్ పాలసీ వాజ్ బ్రాట్ హిమ్. తరువాత ఎట్లా ఉంటదంటే.. ఒక కంపెనీవాడు వచ్చిండు. ఫాక్స్‌కాన్ అని చాలా పెద్ద కంపెనీ వచ్చింది. దాన్ని మహారాష్ట్రవాడు కొట్టకపోయిండు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారుచేసే కంపెనీ. చాలామంది మ హిళలకు ఎంప్లాయ్‌మెంటు దొరుకుతది దాంట్లో. మస్తు తన్లాడినం. ఆల్మోస్ట్ 90% వచ్చిండు. మీ పాలసీ బాగుంది అని అప్రిషియేట్ చేసిండు.. యాళ్లకొస్తే.. మహారాష్ట్ర ప్ర భుత్వం రూ.3,000 కోట్ల నగదు ఇన్సెంటివ్ ఇస్తమని కొట్టకపోయిన్రు. రూ.3,000 కోట్లు ఎదురిస్తమని తీసుకుపోయారు. అప్పుడు మ నకంత కెపాసిటీ లేకుండే.. సరే. కాంపిటీషన్లో రియల్‌గా ట్రై చేస్తే కొన్ని జరుగుతయ్.. కొన్ని జరగవు. రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగే ఆస్కారం ఉంటది. వెల్స్పన్ గానీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కైటెక్స్ గానీ.. చాలా కంపెనీలను తన్లాడి.. తిప్పలబడి తెచ్చినం. వట్టిగ హైప్ క్రియేట్ చేసి, మందిని మోసం చేసి, ఇది ఆత్మవంచన. ప్రజావంచన. ఏమన్న వస్తాదా.. ఏమీ రాదు. గ్యాస్‌లో ప్రజలనుబెట్టడం తప్ప.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనివ్వం. మా హక్కుల పరిరక్షణలో ఒక్క డ్రాప్ తక్కువైనా.. ఎట్ ఎనీ కాస్ట్.. ఎట్ వాట్ ఎవర్ కాస్ట్.. టీఆర్ఎస్, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం.
-కేసీఆర్
మహిళలకు ఇస్తామన్న రూ.2,500లే దిక్కులేదు. కోటిమందిని కోటీశ్వరులను చేస్తరట. మంత్రులంత ఒక్కటే పాటపాడుడు. ఎట్ట చేస్తవయ్యా.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను? నీ దగ్గర ఉంటెనా? ఉన్న రెవెన్యూ యే పీకింది రాష్ర్టానిది. లోపటికైపోయింది. మేమున్నప్పటి గ్రోత్‌లో 50% లేదు. మీకు గ్రోత్ గురించి అవగాహన ఉన్నదా? ఎట్ట ఒ క్కొక్క రూపాయి కూడబెట్టాల.. ఎట్టెట్ట తీసుకుపోవాలె. నేను సీఎంని అయ్యాక ఎంతమంది నన్ను టెమ్ట్ చేసినా ఐఏఎస్ అఫీసర్లు.. వాళ్లు, వీళ్లు. రూపాయి రిజిస్ట్రేషన్ చార్జీ పెంచలే నాలుగేండ్ల దాక. ఉల్టా నేను వాళ్లను పిలిచి మీకు ఏమి కావాలె. రియల్ఎస్టేట్ బాగ కావా లె. హైక్లాస్ కావాలె అని. హైదరాబాద్‌లో కూడా స్కైలైన్లు రావాలని చెప్పి మూడేండ్లు తిప్పలపడ్డ. అది తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్‌భవన్ గేట్ పక్కన ఒక టవర్ ఉంటది. నేను పోతుంటే అప్పుడే ఆయన పు నాది తీసిండు. ముందే వాటర్‌ఫ్రంట్ బాగుంటది. ఆగు.. 50 అంతస్తులకి ఇద్దాము అంటే.. ఆ రాజు ఆగలే. ఆయన అంతకే కట్టుకున్నడు పాపం. ఇట్ టుక్ మీ త్రీ ఇయర్స్ టు బ్రింగ్ స్కైలైన్ టు హైదరాబాద్. ఒక సిస్టం చేసినం. ఓపికతో.. వాళ్లతో డిస్కస్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఒక క్రమపద్ధతిలో పోయినం. అట్ల ఉంటది పద్ధతి.
నాలా ఫీజులు తొలగించినం. దానికోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లే అవసరం కూడా లేకుం డా చేసినం. భూముల ధరలు పెంచినం. ప్రజా ఆస్తుల విలువ పెంచినం. నాలుగు ఎకరాలు ఉన్నోడు ధీమాతో రెండుకోట్ల శ్రీమంతుడినని కాలర్ ఎగిరేసి చెప్పుకునెటోడు. ఇయా ల ఏమైనై భూముల ధరలు? కుప్పకూలిపోయినై. ఎకరా కూడా అమ్ముడు పోతలేదు. ఎక రం అమ్మి అమ్మాయి పెండ్లి చేద్దామంటే కొనే దిక్కులేదు. కండ్లకు నీళ్లు పెట్టుకుంటున్నరు ప్రజలు. కొనే దిక్కులేదు. అమ్ముకుందామం టే.. ఇష్టమొచ్చిన ధరలకు.. అడ్డమైన ధరలకు అమ్ముకోవాలె. హరాకిరి మాటలు చెప్పి, అడ్డమైన హామీలిచ్చి, చేయచేతగాక, కేవలం రాయకీయ అధికారమే లక్ష్యం అనే పద్ధతిలో ప్రజలను వంచించి, రైతాంగాన్ని ఏడిపిస్తున్నరు. పేద ప్రజలను ఏడిపిస్తున్నరు. విద్యార్థులను ఏడిపిస్తున్నరు. రిటైర్డ్ ఉద్యోగులను ఏడిపిస్తున్నరు, పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నం అం టున్నరు. కాగ్ ఉతికింది కద.. ఈ చెంప ఆ చెంప వాయించింది కద. తీసుకున్న అప్పులె న్ని అంటే రూ.2 లక్షల 90 వేల కోట్లు మొత్తం కలిపి. ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు.
మా గవర్నమెంటు వచ్చిన్నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉండె. దాన్ని రూ.2.47 లక్షల కోట్ల వరకు తీసుకుపోయినం. స్టెప్ బై స్టెప్ చేసుకుంటు పోయినం. గాల్లో మాటలు చెప్తే వస్తయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే.. కాంక్లేవ్లు పెట్టలే.. పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ తెస్తే ఆటోమేటిక్గనే అట్రాక్ట్ అయి వస్తరు.
-కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడం. ఈ ప్ర భుత్వాన్ని నిద్రపోనివ్వం. కేంద్రాన్ని కూడా నిద్రపోనివ్వం. హక్కుల పరిరక్షణలో డ్రాప్ తక్కువైనా ఎట్ ఎనీ కాస్ట్.. ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. మీటింగ్ జరుగుతుంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనది 4 గంటలకు అయిపోవాల్సింది. ఇట్ వజ్ ఎక్స్టెండెడ్. 5 గంటలకు ఉత్తమ్ ప్రెస్‌మీట్ పెట్టిం డు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది. కేసీఆర్‌ది కాంగనే మనం కూడా మొరగాల. చిట్‌చాట్. ఈ రోజు నేను పాలమూరు ఎత్తిపోతల పథకానికే పరిమితమవుతున్న. సబ్జెక్ట్ డై ల్యూట్ అవుద్ది కాబట్టి వేరే విషయాలు ఇప్పు డు చెప్పను. ఐయామ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. ఎనీ కొశ్చెన్, 100 కొశ్చెన్స్ యు పుట్ మీ.. ఐ విల్ గివ్ఆన్సర్ టుమారో.. ఆర్ డే ఆఫ్టర్ ఎనీటైమ్. థ్యాంక్యూ’ అని ప్రసంగం ముగించారు.
మహిళలకు ఇస్తామన్న రూ.2,500లే దిక్కులేదు. కోటిమందిని కోటీశ్వరులను చేస్తరట. ఎట్ట చేస్తవయ్యా.. నీ దగ్గర ఉంటెనా? ఉన్న రెవెన్యూయే పీకింది. మేమున్నప్పటి గ్రోత్‌లో 50% లేదు.
-కేసీఆర్
ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ల నోటికి మొక్కాల. ఎప్పుడో ఒక సందర్భంలో.. కోపమొచ్చి ఒక మాట తిట్టినమంటే అది వేరు. పొద్దాక అదే కథనా? కేసీఆర్ చచ్చిపోవాల. మాట్లాడినప్పుడల్ల ఇదేనా? ఎక్కడ మాట్లాడినా.. ఏ సందర్భంలో మాట్లాడినా.. కాలేజీలో మాట్లాడినా, స్కూలు పిల్లలకాడ మాట్లాడినా.. ఇంత అక్కసు ఉంటాదా మనుషులకి? అది కరెక్టయితదా? ఇష్టమొచ్చిన పద్ధతిలో మాటలు. ఇష్టమొచ్చిన దుర్మార్గపు ప్రచారాలు. అన్నీ పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది.. జరుగుతున్నది వేరుంది. అన్నీ రికార్డ్ అవుతున్నయి ప్రజల్లో. అన్నీ గమనిస్తున్నరు.
‘బిజినెస్ మీట్ పెడతం. ఎంవోయూలు చేసుకుంటం. ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ.. దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు? ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆద్యుడు, గురువు చంద్రబాబునాయుడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన లెక్కలు బిజినెస్ వచ్చేదుంటే, ఎంవోయూలు సక్సెస్ అయ్యేదుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఈపాటికి రూ.20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైమ్ అక్కడ సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్‌లో పెట్టిండు. వైజాగ్‌లో ఎవర్రా ఎంవోయూలు చేసిందంటే వంట మనుషులని చెప్పిన్రు. స్టార్ హోటళ్లల్లో ఉండే వంట మనుషులు, సైప్లె చేసేటోళ్లు.. వచ్చి కూసోని.. సంతకం పెట్టు అంటే.. పెట్టిన్రు పాపం. ఇది నిజం. పెద్ద పాపులర్ అయింది అది. అవి నిజమైతే, ఆఖరికి ఒక రూ.పది వేల కోట్లన్న రావాలె. రూ.15 లక్షల కోట్లు, రూ.ఆరు లక్షల కోట్లు, రూ.ఎనిమిది లక్షల కోట్లు.. ఇప్పుడా పెట్టుబడులన్నీ ఎక్కడ బాయె..’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటి. భోపాల్‌లో అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. తరువాత నీతి ఆయోగ్ సబ్ కమిటీకి చైర్మన్ అయిండు. ‘నేను భోపాల్‌లో పెడత.. వచ్చిపో’ అని బతిమిలాడితె.. ఫోన్ల మీద ఫోన్లు చేస్తే.. సరే అని పోయిన. అప్పుడు వసుంధరరాజే చెల్లెలు యశోధరారాజే ఇండస్ట్రీ మినిస్టర్‌గా ఉండె మధ్యప్రదేశ్‌కు. ఆమె వచ్చి.. ‘నీ కొడుకొచ్చి.. ఆగమాగం చేస్తుండు’ అన్నది. ‘అదొకటి.. ఇదొకటి మాట్లాడి చేసుకుంటుండు’ అన్నది. నువ్వు కూడా తన్లాడు.. గట్టిగ చెయ్.. అన్న. అంతకుముందు నేను భోపాల్ పోవడానికి రెండు, మూడు నెలల ముందు అక్కడొక కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ వచ్చిండు అక్కడకి. అప్పుడు రూ.14 లక్షల కోట్లకు ఎంవోయూ చేసిపడేసిన్రు. ‘మొన్ననే రూ.14 లక్షల కోట్లకి ఎంవోయూలు చేశారు కదా. మరి మీరు రాలేదంటరేంటి?’ అని ఆమెను అడిగిన… ‘ఓ సబ్ బోగస్ హై సాబ్’ అన్నది ఆమె. ఆమె నాతోని అన్నది ప్రామీస్ చెప్తున్న. ఐ వాజ్ షాక్డ్. ‘అది వచ్చేదా, పోయేదా సార్.. వట్టి గ్యాస్’ అన్నది. ఈ గ్యాస్‌లు ఎవరిని మోసం చేయడానికి? ఇంత వంచిస్తరా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా. కనబడతయ్ కదా. ఆ పెట్టుబడులొస్తే లాభాలు జరుగుతయ్, ఉద్యోగాలొస్తయ్. ఫ్యాక్టరీలు వస్తయ్. అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అయితది. స్టేట్ గవర్నమెంట్లకు జీఎస్టీ పెరుగుతది. ఏమీలేదు.. ఒట్టిదే గ్యాస్.