CM KCR Press meet | కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్ట్‌ను తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం సతాయించినప్పటికీ అనేక నెలలు పోరాడి మరీ ఈ యాక్ట్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా.. పెట్టుబడి సాయం కింద రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను తీసుకురావడం ద్వారా వ్యవసాయ స్థిరీకరణ జరిగిందన్నారు. ఇంకా సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో ఏం మాట్లాడరంటే..
ఆ కాలంలో విత్తనాలు సరిగ్గా దొరికేవి కావు, విపరీతమైన కల్తీ విత్తనాలు ఉండేవి, మొత్తం భారత దేశంలో కేంద్రంతో కొన్ని నెలల పాటు కొట్లాడి ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్ట్‌ను దేశంలో తీసుకువచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఈ యాక్ట్ ఎక్కడా లేదు. అయినా కూడా కేంద్రం మమ్మల్ని చాలా సతాయించింది. అనేక నెలలు కేంద్రంపై పోరాటం చేసి కేంద్రాన్ని ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్ల మీద పీడీ యాక్ట్ తీసుకువచ్చాం. ఎరువులు అసలు దొరికేవి కాదు తెలంగాణ ఏర్పడక ముందు రైతాంగానికి ఎరువులు కావాలంటే రోజుల తరబడి లైన్లలో ఉండటం, గలాటాలు కావడం, చివరకు పోలీస్ స్టేషన్లలో ఎరువుల బస్తాలు పెట్టి అమ్మిన పరిస్థితులు కూడా చూసినం. రైతులు అందరూ చూసిన్రు. ఆ పరిస్థితులు అందరికి తెలిసినవే. ఆరోజు మొత్తం వాడిన ఎరువులతో పోలిస్తే ఈనాడు వినియోగం మూడింతలు పెరిగింది. దాదాపు రెండు పంటలకు కలిపి 50-55 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతుంది.
ఆ రోజు కేవలం 13-14 లక్షల టన్నులుంటేనే పోలీస్ స్టేషన్లలో పెట్టించి అమ్మించారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న దివంగత అనంత్ కుమార్‌ను ఒప్పించి ఎరువులకు డిమాండ్ లేని వేసవి కాలంలో ఇవ్వమని కోరాం. ఇందుకు కేంద్రాన్ని ఒప్పించాం. ఆ ఎరువులను నిల్వ చేసేందుకు గౌడౌన్లను ఆఘమేఘాల మీద నిర్మించాం. మంచి విత్తనాలను అందుబాటులో ఉంచాం. ఎరువులను అందుబాటులోకి తేవడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచుకున్నం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, పెట్టుబడికి రైతుబంధు ఇవ్వడం, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా ఇవ్వడం వంటి చర్యల వల్ల అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగింది అని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్