హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో దాశరథి అందించిన పోరాట స్ఫూర్తి ఇమిడి ఉన్న దని పేర్కొన్నారు.
దాశరథి కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.