చానా రోజుల తర్వాత పొద్దుగాల తమ్ముడి(చిన్నమ్మ కొడుకు)తోని మాట్లాడిన.. వానిది హుజూరాబాద్.. నేనుండేది హైదరాబాద్..
ఫోన్ రింగవుతున్నది..
తమ్ముడు: హలో..హలో.. అన్నా ఎట్లున్నవే.. అందరు మంచిగున్నరా..
నేను: మంచిగున్నంరా.. నువ్వేట్లున్నవ్.. అవ్వా అయ్యా మంచిగున్నరా..
తమ్ముడు: మంచిగున్నమన్నా.. చిన్నోడు ఎట్లున్నడు.. ఇంట్లో అందరూ మంచిగున్నరు కదా..
నేను: అందరూ మంచిగున్నర్రా.. ఏం సంగతి? ఏం చేత్తానావ్ రా..?
తమ్ముడు: ఏమున్నదన్నా.. పొద్దున లేసుడు.. ఊరంతా తిరుగుడు.. ఎలక్షన్లచ్చినయ్ కదా.. ఇగ ఇంకేం పని ఉంటది. దోస్తులతోటి కలిసి అల్లతోటి, ఇల్లతోటి తిరుగుడు. బాతకాని కొట్టుడు.
నేను: అవును కదరా.. ఎట్లున్నదిరా ఊళ్లే.. అవ్వా అయ్యా ఏమంటున్నరు..?
తమ్ముడు: ఊళ్ల అందరూ ఒకటే మాటనే. అవ్వ చెప్పిందే చెబుతున్నరు..
నేను: అవునా.. ఏమంటుందిరా అవ్వ.
తమ్ముడు: ఎలక్షన్లని అందరూ ఇంట్లకచ్చి ఓటేయమని అడుగుతున్నరు. అందరితోటి మంచిగనే మాట్లడుతున్నది. అల్లు పోయినంక తిడుతున్నది.
నేను: ఎందుకురా.. ఎందుకు..(ఆత్రుతతో..)
తమ్ముడు: అదే నేనడిగిన.. ఎందుకే గట్లంటవ్ అని.. వాళ్లందరూ గడప దాటేటోళ్లేరా.. నా గడపలున్న మనిషికే ఓటెత్త అంటాంది. ముందుగాల నాకర్థం కాలె.. అడిగితే చెప్పింది.. ఇంట్ల న్యూస్ పేపర్ల ఫొటో సూపెట్టి కేసీఆర్ సారుకే అని..
నేను: అగో.. కేసీఆర్ సారు.. గడప లోపల ఉండుడేందిరా..
తమ్ముడు: అదే నేనడిగిన.. మొన్న నాకు అకాశికి డ్రెస్సు కొన్నది. అది అయ్యకచ్చిన పింఛిన్తోని కొన్నదట. నెలకింద పొలానికి విత్తనాలు అవసరమైతే రైతుబంధు డబ్బులు వాడిందట. పోయినేడు అక్క పెండ్లి చేసింది కదా. అప్పడైన అప్పు కల్యాణ లక్ష్మితోని కట్టిందట. ఇగ మొన్న పంట అమ్మితే డబ్బులచ్చినయని చెప్పింది. పంటరుణం మాఫీ అయితదని సంబురపడుతున్నది. కేసీఆర్ లేకుంటె ఇయ్యన్నీ ఎక్కడియి అంటది. నా పెద్ద కొడుకని చెబుతది. ఊళ్లే దోస్తులందరు కూడా గిదే మాట అంటున్నరు. వాళ్ల ఇండ్లల్ల గిదే ముచ్చటనట.
నేను:.. కాసేపాగి అవును కదరా.. ఏ లోటు లేకుండా చూసుకునేటోడే కొడుకైతడు. అందుకేనేమో.. ముసొళ్లలందరూ ఒకే తరీక అంటున్నరు. మా ఇంట్ల కూడా అయ్యా అవ్వా అదే అంటున్నరు.
తమ్ముడు: అవునా అన్నా.. గట్లయితే మన ఇంట్లోళ్లతోనే మనం.
నేను: గంతే కదరా.. మరి ఇంకేం సంగతిరా..
తమ్ముడు: సరే అన్నా.. నేను మళ్లా చేత్తా.. రేషన్ బియ్యం కాడికి పోవాలే..
నేను: సరేరా తమ్మీ. ఉంట.