గోవిందరావుపేట, జనవరి 12: తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నే మొదటి స్థానంలోకి తీసుకెళ్లిన అభివృద్ధి ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కొనియాడారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత వీరపనేని రామదాసు 105వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వీరపనేని శివాజీ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం రామదాసు విగ్రహంతో పాటు ఆయన సతీమణి వెంకట సుబ్బలక్ష్మి విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించి మాట్లాడారు.
తెలంగాణలో ప్రతి రైతుకూ సాగు నీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులు చేయించారని గుర్తుచేశారు. ఏజెన్సీలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని మిషన్ భగీరథ ద్వారా అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. గోవిందరావుపేట వాసి స్వాతంత్య్ర సమరయోధుడు రామదాసు నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేసేవారని, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ను సైతం కలిసి గ్రామాభివృద్ధి విషయంలో ముం దుండే వారని తెలిపారు.