హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గిరిజన బిడ్డల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చారని తెలిపారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు. మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు’ అ ని ఆదివాసీ గిరిజనుల కోసం కే సీఆర్ సర్కార్ చేసిన ప్రయత్నాలను అభివర్ణించారు. ‘మావ నాటే మావ రాజ్… మా తం డాలో మా రాజ్యం’ అనే ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 3146 గూడేలను, తండాలను పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు 10 శాతం రిజర్వేషన్లను అ మలు చేస్తూ దేశానికే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారని, ‘జల్..జంగల్.. జమీన్’ నిజం చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఉదహరించారు.