యాదాద్రిలో పూర్తి కావొచ్చిన పనులు
ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ఆధ్యాత్మిక శిఖరమైన యాదాద్రి పునరవతరణకు సర్వం సన్నద్ధమైంది. ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కే చంద్రశేఖర్‌రావు సోమవారం పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ నుంచి యాదాద్రిని విహంగవీక్షణం చేసిన సీఎం.. అనంతరం కాలినడకన ఆలయ పరిసరాలను పరిశీలించారు. బాలాలయంలో సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రధానాలయం, కల్యాణకట్ట, పుష్కరిణిని సీఎం పరిశీలించారు.75 ఎకరాల్లో తలపెట్టిన మహా సుదర్శన యాగస్థలాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, సీఎస్ సోమేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

