హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కర్ణాటక మాడల్ ఫెయిల్ అయినట్టు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆర్థిక, మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కర్ణాటకలో 3 గంటలే కరెంట్ ఇచ్చి కాంగ్రెస్ సర్కారు అన్నదాతల ఉసురుపోసుకొంటున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయానికి ఎక్కడైనా 10 హెచ్‌పీ మోటర్లు వాడుతారా? అని ప్రశ్నించారు.
పీసీసీ చీఫ్ రేవంత్‌కు వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశా రు. సోమవారం తెలంగాణ భవన్లో వైఎస్సార్టీపీ నుంచి గట్టు రాంచందర్‌రావు అధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్‌రావు గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో వైఎస్సాఆర్టీపీ విలీనాన్ని స్వాగతించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ నడపగలుగుతారా? తెలంగాణ వాళ్లకు అంత సీన్ ఉందా? అని సమైక్య పాలకులు అవహేళన చేశారని గుర్తుచేశారు. పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదని ఎద్దేవా చేశారని, నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ చీకటవుతుందని శాపనార్థాలు పెట్టారని తెలిపా రు. ఇలాంటి అనేక ఒడిదొడుకులు ఎదురొని రెండు దశాబ్దాలుగా పార్టీని నిలబెట్టి, తెలంగా ణ కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని పేర్కొన్నా రు. అవహేళన చేసినవారికి బుద్ధిచెప్పేలా ప్రతి రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
Harishrao
రాజకీయాల కోసం పార్టీని గాలికొదిలేసిన షర్మిల
తండ్రి సమానులైన కేసీఆర్‌పై నానా మాట లు మాట్లాడిన వైఎస్ షర్మిల.. ఈ రోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేశారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కర్ణాటక కాంగ్రెస్ మాడల్ తెలంగాణలో పనికిరాదని ఆ పార్టీ నేతలకు అర్థమైందని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ తోక ముడిచిందని తెలిపారు.
కాంగ్రె స్ నాయకులవి మాటలే తప్ప చేతలు ఉండవని చురకలంటించారు. 24 గంటల కరెంటు వృథా అంటున్నారని, కనీస అవగాహన కూడా లేకుండా వ్యవసాయానికి 3 గంటలే చాలు అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో చేపట్టిన తెలంగాణ ఉద్యమ మే వేస్ట్ అనేలా రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు రాజకీయాల కోసం దిగజారిపోయి తెలంగాణ ఉద్యమాన్నే అవహేళన చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ అమరుల త్యాగాలను అవమానిస్తూ.. ఉద్యమ స్ఫూర్తిని కించపరిచేలా మాట్లాడుతున్న రేవంత్‌కు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్సార్టీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్టీపీలో ఎదుర్కొ న్న సూటిపోటి మాటలు, అవహేళనలు బీఆర్ఎస్లో ఉండబోవని చెప్పారు. గట్టు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ పార్టీలోకి వెళ్లినందుకు ప్రజలకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. షర్మిలను మహిళా నాయకురాలిగా నమ్మి మోసపోయామని అన్నారు. బీఆర్ఎస్లో చేరడంతో తాను పాత ఇంటికే వచ్చినట్టుగా ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారి లో సత్యవతి, గౌతమ్‌ప్రసాద్, డేవిడ్ రాజు, అంజన్‌దాస్, గణేష్‌నాయక్, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు.
సీతక్కకు పని తక్కువ.. ప్రచారం ఎక్కువ
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, పని తకువ.. ప్రచారం ఎకువ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాకే ములుగు జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పారు. ములుగు బీజే పీ నేత తాటి కృష్ణ.. హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ములుగును జిల్లా చేశామని, సమ్మక సారక జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెడీగా ఉన్నదన్నారు. నిరుపేద అమ్మాయి నాగజ్యోతిని గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.