KCR | పిడికిలి బిగించి కేసీఆర్ అభివాదం.. నందినగర్‌కు పోటెత్తిన బీఆర్ఎస్ శ్రేణులు..!
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్‌లోని నివాసంలో 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ తర్వాత ఆయన భారీగా తరలివచ్చిన నాయకులకు పిడికిలి ఎత్తి అభివాదం చేశారు.
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్‌లోని నివాసంలో 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ తర్వాత ఆయన భారీగా తరలివచ్చిన నాయకులకు పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. దాదాపు ఐదు గంటలకు పైగా సిట్ అధికారుల ప్రశ్నలకు బదులిచ్చిన కేసీఆర్‌లో ఏ కోశాన ఆందోళన కనిపించలేదు.
చెరగని చిరునవ్వు, ప్రసన్న వదనంతో బీఆర్ఎస్ శ్రేణులకు నమర్కించి.. పిడికిలి బిగబట్టిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు. ఆయన వెంట కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు.
నందినగర్ నివాసం వద్ద తరలి వచ్చిన వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసిన కేసీఆర్ https://t.co/ru0hXvZWeZ pic.twitter.com/YPdXXgHYlY
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2026
కట్టలు తెంచుకున్న అభిమానం
పోలీసులను తోసుకొని తెలంగాణ భవన్ నుండి నంది నగర్ నివాసానికి బయలుదేరిన 3000 మంది బీఆర్ఎస్ శ్రేణులు pic.twitter.com/LoqjSccgKH
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. నందినరగ్లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకుపైగా అధికారులు కేసీఆర్‌ను విచారించారు. ఇదివరకూ విచారించిన వారు పేర్కొన్న అంశాలపై అధికారులు గులాబీ బాస్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ మొత్తాన్ని అధికారులుఉ ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ అనంతరం కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో కేసీఆర్ మాట్లాడారు.
నల్ల బ్యాడ్జీలతో
అంతకుముందు విచారణ నేపథ్యంలో పోలీసులు నందినగర్‌లో భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయితే.. మచ్చలేని నేతను విచారణ పేరుతో ఇబ్బందికి గురిచేయడాన్ని తట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసులు అడుగడుగునా బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంతో వారంతా తెలంగాణ భవన్లో ఆందోళనకు దిగారు.
విచారణ అనంతరం కేసీఆర్ ను చూసేందుకు నంది నగర్ నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు pic.twitter.com/wOYGVI9Rpr
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KCR
- nandi nagar
- Phone tapping
- SIT
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

