దేవరుప్పుల, మే 24 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఆదివారం ఆయన మండల, గ్రామ, బూత్ లెవల్ ఇన్చార్జులతో జరిగిన సమావేశాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి ఓట్లేసి తప్పు చేశామన్న భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇగ వచ్చేది లేదు.. చచ్చేదిలేదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారని అన్నారు.