కేసీఆర్ హయాంలోనే ఆర్యవైశ్యులకు స్వర్ణయుగం
కేసీఆర్ పాలనే ఆర్యవైశ్యులకు నిజమైన స్వర్ణయుగమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా స్పష్టంచేశారు. ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన సముదాయానికి శంకుస్థాపన చేసి సీఎం రేవంత్‌రెడ్డి క్రెడిట్ కొట్టాలని చూస్తున్నారని, ఆ స్థలాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు.
- ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించిందే కేసీఆర్
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా
హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనే ఆర్యవైశ్యులకు నిజమైన స్వర్ణయుగమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా స్పష్టంచేశారు. ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన సముదాయానికి శంకుస్థాపన చేసి సీఎం రేవంత్‌రెడ్డి క్రెడిట్ కొట్టాలని చూస్తున్నారని, ఆ స్థలాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు గంజి రాజమౌళి గుప్తా, రమేశ్, సత్తయ్యలతో కలిసి ఆయ న మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్యవైశ్యులకు గజం భూమి కూడా ఇవ్వలేదని, కేసీఆర్ హయాంలోనే ఉప్పల్ భగాయత్, హు జూరాబాద్, కమలాపూర్‌లో ఆర్యవైశ్య భవనాలకు స్థలాలు మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రెండు రూపాయలు కూడా నిధులు కేటాయించ లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో పదవుల పందేరం
బీఆర్ఎస్ హయాంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఏడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, టీటీడీ బోర్డు మెంబర్, కాళేశ్వరం ఆలయ చైర్మన్, వరంగల్ మేయర్, తెలంగాణ యూనివర్సిటీ వీసీ పదవితోపాటు 13 మున్సిపల్ చైర్మన్లు, 5 వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చి రాజకీయంగా, సామాజికంగా సముచిత గౌరవం కల్పించారని వివరించారు. బీఆర్ఎస్ నుంచే బొగ్గారపు దయానంద్ ఎమ్మెల్సీగా అవకాశాన్ని పొందారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవీ కాలం ముగిసినా పట్టించుకోలేదని, ఆ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యం దకడం లేదని విమర్శించారు. ఆర్యవైశ్యుల పట్ల గౌరవం, గు రుత్వ భావన ఉన్నదని మాటల్లో చెప్పే సీఎం రేవంత్ రెడ్డి, చేతల్లో వారికి చేసింది శూన్యమని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్తా ధ్వజమెత్తారు. కేసీఆర్ తమ సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో అత్యున్నత అవకాశాలు కల్పించారని తెలిపారు. ప్ర భుత్వం ఇప్పటికైనా ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తక్షణమే నిధులు విడుదల చేసి, రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Arya Vysya
- BRS
- KCR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

