Home
Telangana
Mothe Shobhan Reddy And Ramulu Naik Members Of The Telangana Govt Committee For The Recognition Of Activists Requested Dgp Cv Anand To Provide Details Of Activists Who Faced False
ఉద్యమకారుల ఎఫ్ఐఆర్లు అందించండి.. డీజీపీకి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వినతి
స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ దశల పోరాటాల్లో అక్రమ కేసులు, అరెస్టులు, జైలు శిక్ష ఎదురొన్న ఉద్యమకారుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ దశల పోరాటాల్లో అక్రమ కేసులు, అరెస్టులు, జైలు శిక్ష ఎదురొన్న ఉద్యమకారుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. ఉద్యమకారుల పోరాటాలను గుర్తించి వారికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియలో భాగంగా సంబంధిత రికార్డుల సేకరణ అవసరమని కమిటీ సభ్యులు పేరొన్నారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు పోలీసు శాఖ తరఫున సహకారం అందిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. సంబంధిత రికార్డుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేస్తామని చెప్పినట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

