ఢిల్లీ: ఆసియా క్రీడల్లో క్రీడాకారుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశిస్తున్న భారత్.. ఈ గేమ్స్‌లో అథ్లెట్ల సన్నాహకం నిమిత్తం వారిపై రూ. 702 కోట్లను వెచ్చించింది. మూడేండ్లుగా ఆటగాళ్లకు శిక్షణ, కోచ్‌ల నియామకం, వారికి అవసరమైన పరికరాలు, వసతుల కల్పన వంటి వాటిపై ఈ ఖర్చు చేసినట్టు ‘టాప్స్’ సీఈవో ఎన్ఎస్ జోహాల్ తెలిపాడు.
ఈ క్రీడల కోసం భారత్ మొత్తంగా 501 అథ్లెట్లను పంపిస్తుండగా వీరిలో 310 మంది ఆసియాడ్‌లో ఆడనుండటం ఇదే తొలిసారి. గత ఎడిషన్‌లో 106 పతకాలు సాధించిన భారత్.. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.