KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి (Diwali)పండుగ మనకు అందిస్తుందని చెప్పారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Harish Rao | ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారెంటీ.. రేవంత్..నీ కుర్చీ కాపాడుకో!