హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ‘హాలో కులకర్ణి.. ఆరోగ్యమెట్లున్నది..? ఏం బాధపడకు.. ధైర్యంగా ఉండు.. దవాఖాన ఖర్చులన్నీ నేనే భరిస్తా..’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చారు. ఇటీవల బ్రెయిస్ట్రోక్కు గురై హైదరాబాద్‌లోని ఒక దవాఖానలో చికిత్సపొందుతున్న ధరణి కులకర్ణిని పార్టీ అధినేత ఆదేశాల మేరకు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ బుధవారం పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కులకర్ణితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. చికిత్స ఖర్చులను తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కాగా, పార్టీ అధినేత కేసీఆరే స్వయంగా ఫోన్ చేయడంతో కులకర్ణి, ఆయన కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.