కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ప్రజలకు అదృష్టం
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయ డం ఇక్కడి ప్రజల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
కామారెడ్డి, సెప్టెంబర్ 14 : కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయ డం ఇక్కడి ప్రజల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించి దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. అన్నదాతలకు 24 గం టలు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన తెలిపారు.
కుల వృత్తులను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. వం దశాతం సబ్సిడీతో చేపపిల్లలు, రొయ్యలను అందిస్తున్నామని, ఫలితంగా మత్స్య సంపద బాగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో హైదరాబాద్‌కు దీటుగా కామారెడ్డిలో భూముల విలువ పెరిగినట్టు తెలిపారు. కామారెడ్డి ప్రజలు సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

