హైదరాబాద్, ఫిబ్రవరి 12 : పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్కి రైతులతో గెలుక్కొంటున్నదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో శనివారం నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఈ మధ్య పిచ్చి ముదురుతున్నది. పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నరు. మెడమీద కత్తిపెట్టి కరెంటు సంస్కరణల పేరు మీద ప్రతి బాయికి, ప్రతి మోటర్‌కు మీటర్ పెట్టాలని ఒత్తిడి తెస్తున్నరు. దీనికి ఒప్పుకొందామా? బాయికి మీటర్ పెడదామా? ఫ్రీ కరెంటు ఇద్దామా? ఫ్రీ కరెంటే ఇవ్వాలంటే ఏం చేయాలె? నరేంద్రమోదీని తరిమితరిమి కొట్టాలె’ అని పేర్కొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
రైతులను ఏడాదిపాటు ఏడిపిచ్చిండు..
వ్యవసాయ చట్టాలు తెచ్చిన్రు. ఏడాదిపాటు రైతులను ఏడిపిచ్చిండ్రు. ఢిల్లీ దగ్గర రైతులను అవమానపరిచారు. వారిని ఖలిస్థాన్ ఉగ్రవాదులని అన్నరు. ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జీలు చేసిండ్రు. గుర్రాలతో తొక్కిచ్చిండ్రు. చివరికి యూపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి కొడుకు ధర్నా చేస్తున్న రైతులను కారుతో తొక్కించటం అందరూ టీవీల్లో, పేపర్లలో చూసిన్రు. ఐదు రాష్ర్టాల ఎన్నికలు రాగానే ఆ బిల్లులను వాపస్ తీసుకోవడమే కాదు, ప్రధానమంత్రి స్వయంగా క్షమాపణ కోరుతున్నా అని మాట్లాడిండు.
మెడమీద కత్తిపెట్టి మీటర్ పెట్టాలంటున్రు
ఏపీలో, తెలంగాణలో గతంలో చాలా కరెంటు ఇ బ్బందులు ఉండె. ఏపీలో ఇంకా తగ్గలే. తెలంగాణలో మ నం బాగు చేసుకొన్నం. మన సొంత పైసలు పె ట్టి 24 గంటలు వ్య వయసాయంతోసహా అన్ని రంగాలకు కరెం టు ఇస్తున్నం. అసెంబ్లీలో ఓ తెలివి తక్కువవాడు అడిగితే నేను చెప్పిన.. మా రైతులకోసం రూ.10 వేల కోట్లయినా, రూ.15 వేల కోట్లయినా బిల్లు నేను కడతా. రాష్ట్ర ప్రభుత్వమే కడతది అని. మా రైతులు ఇంకా జర బాగుపడాలె, గట్టిగ కావా లె, ఇంకొక ఐదారేండ్లు రైతుబంధు ఇచ్చి, ఫ్రీ కరెంటు ఇచ్చి, ఫ్రీ నీళ్లిస్తే అప్పులన్నిపోయి రైతులు మంచిగైతరు, గ్రామాలు చల్లగుంటయి, రైతు పండించే పంటపై ఒక్క రైతే బతకడు కాబట్టి, మేమే చేసుకుంటము.. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన. కానీ నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంటు సంస్కరణల పేరుతో ప్రతి బాయికి, బోరుకు మోటర్ పెట్టాలె, మీటర్ పెట్టాలె, రైతులకు డైరెక్టు సబ్సిడీ ఇయ్యొద్దంటున్నడు. పవర్ కొనాలె.. ఎందుకంటే ఆయన దోస్తులు పెట్టుబడుదారులు కాబట్టి. ఎవడో 30 వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడతడట. అది మనం కొనాలట!
మీ షావుకార్ల కోసమే సంస్కరణలు
నాగార్జునసాగర్‌లో, శ్రీశైలంలో, పులిచింతలకాడ మనకు జల విద్యుత్తు ఉన్నది. దాన్ని బందువెట్టి, ఆయన షావుకార్లకాడ కరెంటు కొనాలట. దానికి అందమైన పేరు విద్యుత్తు సంస్కరణలు. విద్యుత్తు సంస్కరణలు అమలుచేస్తేనే డబ్బులిస్తం. లేకపోతే ఇయ్యమంటున్నరు. నువ్వు ఇయ్యకున్నా ఫరవాలేదయ్యా.. ఉన్నంతలో గంజో గటకనో మేము ఇచ్చుకుంటమంటే కూడా కుదరదు అంటున్నడు. మరి కొట్లాడాలా? ఇంట్లో పండాలా? మోదీ ప్రభుత్వానికి పిచ్చెక్కి రైతులతో గెలుక్కుంటున్నది.
బీజేపీ పాలనలో ఎవరికి మేలు జరిగింది?
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిండ్రు. డబ్బాల రాళ్లేసి లొడలొడ ఊపినట్టు ఒర్లుడు తప్ప ఏదైనా మంచిపనైందా? కేంద్రప్రభుత్వం ఏదైనా మంచిపని చేస్తే మనదాక రాదా? రావాలె కదా! ఏ రంగానికి చేసిండ్రు? వ్యయసాయ రంగానికా? దళిత వర్గానికా? గిరిజన వర్గానికా? బీసీ వర్గానికా? చేనేత కార్మికులకా? గీత కార్మికులకా? ఎవరికి లాభం జరిగింది దేశంలో? ఎవరు బాగుపడ్డరు? గ్రామీణులు, సామాన్య ప్రజలు, పేదలకు ఎవ్వరికీ ఏకాణా పని జరగలే. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే.. ఏయ్ కేసీఆర్ నీ సంగతి చూస్తం అంటరు. ఏం సంగతి తోకమట్టనా? ఏంది చూసేది సంగతి? చూసేది కేసీఆర్ సంగతేనా? కేసీఆర్ భయపడతడా? భయపడితే తెలంగాణ వచ్చునా?
పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తులు
కుక్కల్లాగ యాడబడితె ఆడ అరవడం కాదు. దమ్ముంటే ఎవడో బీజేపీ మొనగాడు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలె. దేశంలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా? దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఎట్ల పడిపోతున్నయ్! గత సెప్టెంబర్‌లో 4.4 శాతం, అక్టోబర్‌లో 4 శాతం, నవంబర్‌లో 1.4 శాతం, డిసెంబర్లో 0.4 శాతం. ఇది నా లెక్క కాదు.. దీన్ని ఏమంటరండీ నరేంద్రమోదీ గారు? మీ ఉజ్వలమైన, గొప్ప పరిపాలనకు ఇది తార్కాణమా? దేశంలో 15-16 లక్షల పరిశ్రమలు మూతపడ్డది నిజం కాదా? 140 కోట్ల జనాభా ఉండే దేశంలో ఈ దరిద్రపు పద్ధతా? ఈ మత విద్వేషమా? దీని వల్ల ఎవని కాలు నిండుతది.. ఎవని కడుపు నిండుతది? ఎవనికి పనికొస్తది.. దేనికి పనికొస్తది? పిల్లల ఉద్యోగాలుండాలన్నా, రాష్ర్టానికి పెట్టుబడులు రావాలన్నా, ఈ దేశంలో అందరు ముందుకుపోవాలన్నా, కులం, మతం, జాతి భేదం లేకుండా అందరం ముందుకు పోవాలి.
మతపిచ్చి లేని అమెరికా ప్రపంచాన్ని శాసిస్తున్నది..
అమెరికాలో 95 శాతం క్రైస్తవులు ఉంటరు. వాళ్లెప్పుడూ మతపిచ్చి లేపరు. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నరు. అనేక దేశాల్లో అనేక మతాలవారుంటరు. కానీ మతపిచ్చి లేపరు. ఇక్కడ పొద్దునలేస్తే ఈ పిచ్చి కొట్లాటలు కొట్లాడుతరు. దాంతో వచ్చేదేంది? ఒక పొ లం పారుతదా? ఒక ప్రాజెక్టు వస్తదా? ప్రజలు ఆలోచన చేయాలె. రాజకీయంగా అర్థంచేసుకొని, రాజకీయంగా స్పందించకపోతే, అవసరమైన విధంగా ప్రజ లు తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతది. నా శనం అయితది. నేను బాధతో చెప్తున్న అని అన్నారు.
మత పిచ్చి లేపితే ఊరుకొంటమా?
మేధావులు, విద్యార్థులు, యువకులు ఆలోచనచేయాలి. నేను చెప్పేమాట వినుడు కాదు.. గ్రా మాలకు పోయిన తరువాత చర్చ పెట్టండి. మీ కుటుంబంలో చర్చ పెట్టండి. మీ ఊళ్లో పదిమంది పోగై చర్చ పెట్టండి. ఇయ్యాల ఎవడన్నా ఆఫ్గనిస్థాన్ పోయి పెట్టుబడి పెట్టమంటె పెడతడా? ఎన్ని పైసలిచ్చినా పెట్టరు. ఎందుకు పెట్టరు! తెలంగాణకి ఇయాల పెట్టుబడులు వస్తున్నాయంటే ఎందుకొస్తున్నయ్? ఈ బీజేపీ ఉంటే, మత కల్లోలాలు రేగితే, పొద్దున లేస్తే లాఠీ చార్జీలు, లూటీ చార్జీలు, కర్ఫ్యూలు, ఫైరింగులు చేస్తే ఎవడన్నా వస్తడా? శాంతి ఉంటే, సౌఖ్యం ఉంటే, లా అండ్ ఆర్డర్ బా గుంటే పెట్టుబడి పెట్టేవాడొస్తడు. కార్ఖానాలొస్తయ్, ఫ్యాక్టరీలు వస్తయ్. నరేంద్రమోదీ సిగ్గుపడాలె.. ఈ దేశం ఎవనయ్య సొత్తు కాదు. నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఎవడూ కూర్చోడు.