హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): శాసనమండలి, శాసనసభలో బీఆర్ఎస్ విప్‌లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. మండలి విప్ గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసనసభ విప్‌గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ను బీఆర్ఎస్ఎల్పీ పక్షాన ఎంపిక చేసినట్టు కేసీఆర్ శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఆ లేఖలను మంగళవారం అందజేశారు.
నా ఇంట్లో కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంది? : దానం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): తన ఇంట్లో కేసీఆర్, వైఎ స్సార్ ఫొటోలుంటే తప్పేందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించా రు. ప్రజల పక్షాన పోరాడే విషయంలో తగ్గేది లేదని, వైఎస్సార్ హయాంలో అధికారులతో కాంప్రమైజ్ కాలేదని, ఇప్పుడు హైడ్రా విషయంలోనూ తగ్గేదిలేదని తేల్చిచెప్పారు.