సింగరేణి లాభాల్లో కార్మికులకు 30% వాటా
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత ఏడాది ప్రకటించిన 29% కంటే 1% ఎక్కువ
- దసరా కానుకగా సీఎం కేసీఆర్ ఆదేశం.. కార్మికులకు ఇచ్చేది 368 కోట్లు
- 44 వేల మందికి లబ్ధి.. అక్టోబర్ 1న చెల్లింపులు: సీఎండీ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత ఏడాది ప్రకటించిన 29% కంటే 1% ఎక్కువ.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనున్నది. ఈ మొత్తాన్ని దాదాపు 44 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు అక్టోబర్ 1న చెల్లిస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. దసరా కానుక ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కార్మికుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు
దసరా కానుక ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు.
సింగరేణి పురోగతి..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

