KCR | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో తులతూగాలన్నారు. భోగభాగ్యాల సంక్రాంతి పండుగ అందరి ఇంట కలల పంట పండించాలన్నారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా భోగభాగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శనివారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలని అభిలషించారు. ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగరేసే ప్రతి ఒకరు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు.