KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణను తిరిగి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణను తిరిగి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ సీనియర్ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిందని, వాటి అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని కేటీఆర్ అన్నారు. దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణ గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసి ఉద్యోగాలపై హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని ఎంతవరకు నెరవేర్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మైనారిటీల సంక్షేమానికి రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఆ హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆసరా పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పాల్సింది పోయి తిట్లు, అక్రమ కేసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పెద్దల కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల వ్యవహారాలు, వ్యాపార ఒప్పందాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. సుమారు రూ.200 కోట్ల విలువైనదిగా చెబుతున్న ఐదు ఎకరాల భూమిని రూ.7 కోట్లకే తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. అమెరికాలో నివసిస్తున్న మరో తమ్ముడికి సంబంధించినదిగా పేర్కొంటున్న రూ.1,000 కోట్ల డీల్‌పై సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులతో భయపెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల హక్కు కూడా అని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. దేశంలో మతతత్వ రాజకీయాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఒక్కటే సరిపోదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొనే రాజకీయ సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు, తాగునీటి కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, అపార్ట్మెంట్లలో జనరేటర్లు అవసరమయ్యే పరిస్థితులు ఉండేవని అన్నారు. కేసీఆర్ పాలనలో విద్యుత్, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పదేళ్లపాటు పాలన సాగించామని, హైదరాబాద్‌లో గంగా-యమునా తెహజీబ్ సంప్రదాయాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని కేటీఆర్ అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణను తిరిగి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

