హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాటకమాడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుకు బేడీలు వేయడం దుర్మార్గమైన చ ర్య అని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదనేందుకు ఇదొక ఉదాహరణ అని చె ప్పారు. రైతు రాజ్యం తెస్తామని చెప్పి బేడీలు వేస్తా రా అని నిలదీశారు. ఈ ఘటనపై యావత్ తెలంగాణ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నదన్నారు.