Karthika Pournami | వేములవాడ టౌన్, నవంబర్ 5 : కార్తీకపౌర్ణమి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్ బుధవారం కార్తీక దీపకాంతుల్లో వెలిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో నేతివత్తులతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దుయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయం మార్మోగింది.

Vemulawada
వేకువజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి భీమేశ్వరసదన్‌లో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రాజన్న ఆలయ ముందు భాగంలో జ్వాలాతరణం కనుల పండుగా జరిపారు. వేకువజాము నుండే భక్తులు అధికసంఖ్యలో ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి భీమేశ్వర సదన్‌లో లక్ష దీపోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

Vemulawada
అనంతరం రాజన్న ఆలయం ముందు భాగంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. జ్వాలాతోరణ కార్యక్రమం ఆద్యంతం భక్తులను తన్మయత్వంలో మునిగిపోయారు. కార్తీకమాసం ప్రారంభం నుంచి శివాలయాల్లో కార్తీకదీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా భీమేశ్వరాలయంలో ఆలయ అర్చకులు జ్వాలాతోరణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్టీవో రాధాబాయి, ఆలయ అధికారులు. అర్చకులు పాల్గొన్నారు.

Vemulawada

Vemulawada