Dr. Dilip Bhanushali | వైద్య రంగంలో ఆటోమేటెడ్ హెల్త్ మానిటరింగ్ కొత్త దిశకు శ్రీకారం: డాక్టర్ దిలీప్ భానుశాలి
Dr. Dilip Bhanushali | వైద్య రంగంలో ఆటోమేటెడ్ హెల్త్ మానిటరింగ్ పద్ధతులు కొత్త దిశను చూపనున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి అన్నారు.
కొండాపూర్ : వైద్య రంగంలో ఆటోమేటెడ్ హెల్త్ మానిటరింగ్ ( Automated health monitoring ) పద్ధతులు కొత్త దిశను చూపనున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి ( Dr. Dilip Bhanushali) అన్నారు. బుధవారం మాదాపూర్‌లోని సైబర్ గేట్ వే ఐటీ పార్కులో భా ఆరోగ్యం( Bha Arogyam) , జెనెసిస్ ఇన్ఫోఎక్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ భానుశాలి మాట్లాడుతూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ(Artificial Intelligence Technology) రాకతో వైద్య ఆరోగ్య రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వేగంగా రోగ నిర్ధారణ చేయడంలో ఏఐ పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణలో సరికొత్త టెక్నాలజీలను ఏకీకృతం చేయడంలో భాఆరోగ్యం సంస్థ దార్శనిక విధానం ప్రశంసనీయమన్నారు.
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) హైదరాబాద్ డైరెక్టర్ సి.కవిత మాట్లాడుతూ. భా ఆరోగ్యంలో ఈక్విటీ వాటాదారుగా ఎస్టీపీఐ సాంకేతిక మార్గదర్శకత్వం, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలతో వ్యూహ్మాతక సహకారాల ద్వారా అవసరమైన మద్దతును అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ సంస్థ సీఈఓ డాక్టర్ వినయ్ సరికొండ, భా ఆరోగ్యం డైరెక్టర్ సత్యనారాయణ శాస్త్రి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి, భాఆరోగ్యం డైరెక్టర్లు పి.రవీంద్ర, సురేష్ గౌడ్, ట్రెడిషనల్ వెల్నెస్ ట్రైనర్ యోగి సుదర్శనాచార్య, జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పూజా, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

