 
                                                            Srisailam | శ్రీశైలం : శ్రీశైలం ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారమైన సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాతాళగంగ వద్ద నెల్పకొల్పబడిన కృష్ణవేణి నదీమ తల్లి విగ్రహానికి పూజాదికాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు జరిపించారు.
అదే విధంగా పాతాళగంగ ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు, దశహారతులు సమర్పించారు. అదేవిధంగా నదీమతల్లికి పూజాదికాలు, సారె సమర్పణ, దశహారతులను అర్పించారు.

ఈ హారతి కార్యక్రమానికి ముందు లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. మహా గణపతి పూజ కూడా నిర్వహించారు. సంప్రదాయాన్ని అనుసరించి నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూర హారతులు ఇచ్చారు.
హారతులు – ఫలితాలు
ఏకహారతి : ఈ ఏకహారతిని దర్శంచడం వలన భగవదనుగ్రహం లభిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి.
నేత్రహారతి : ఈ నేత్రహారతి దర్శనం వలన ఆరోగ్యం చేకూరుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
బిల్వహారతి : ఈ బిల్వహారతి దర్శనం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.
నాగహారతి : ఈ నాగహారతి దర్శనం వలన సమస్త సర్పదోషాలు తొలగిపోతాయి. వివాహం, సంతానం కలుగుతాయి.
పంచహారతి : ఈ పంచహారతిని దర్శించడం వలన ప్రకృతి వైపరీత్యాలు నివారించబడుతాయి. సకలశుభాలు కలుగుతాయి.
సద్యోజాతాది పంచహారతులు : ఈ సద్యోజాతాది పంచహారతి దర్శనం వలన శివకటాక్షం సిద్ధిస్తుంది. సకల సంపదలు కలుగుతాయి.
 
                            