మెట్పల్లి పట్టణంలోని చావిడ వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సైనిక ఫౌండేషన్ సభ్యుడైన బాస చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా పరీక్ష సామాగ్రిని శుక్రవారం అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో క్రమశిక్షణగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలా అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నంబి రాజేందర్ శర్మ ఫౌండేషన్ సభ్యులు హరి గల రాకేష్, జనార్దన్, శ్రావణ్, హరీష్, చిరు, వినోద్, తదితరులున్నారు
పెగడపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన పరిసే రాయమల్లు, నామసాని రాజయ్య, నామసాని రాజకుమార్, ఎనగందుల విక్రమ్, సట్టా నాంపల్లి అను వ్యక్తులకు పలు కేసులలో కోర్టు నుండి సమన్లు వచ్చాయి. కానీ ఈ ఐదుగురు వ్యక్తులు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఐదుగురికి వారెంట్ జారీ చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. జగిత్యాల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్.. ఐదుగురు వ్యక్తులకు వారం రోజుల జైలు శిక్ష విధించారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 7 : చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్ 21 మైనర్ కాలువ ద్వారా 31 మంది భూ బాధితులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని నాలుగు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు భూ భావిత రైతులు తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి భూ బాధితుల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని అధికారులు ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా దీక్ష విరమణ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు డి -4 లింకు ద్వారా మాత్రమే రైతుకు ప్రయోజనం చేకూరుతుందని, ఎల్-21తో ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు తెలిపారు. నిరాహార దీక్షను అధికారుల మేరకు తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు రైతులు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం ఉదయం దీక్ష శిబిరాన్ని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్ష విరమణ చేసిన వారిలో భూ బాధిత రైతులు జీల సంపత్, మంతెన మహేందర్, జేరిపోతుల సిద్ధార్థ, వంతడుపుల తిరుపతి, సమ్మయ్య, రవి, బాబు, వెంకటేష్, రాజవ్వ, భాగ్యలక్ష్మి తదితరులున్నారు.
మంథని, ఫిబ్రవరి 7 : మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం పెద్దపల్లి నుంచి మంథని వైపు ద్విచక్ర వాహనంపై (AP 15D 4780)వస్తున్న యువకుడిని మంత్రి పట్టణ శివారులోని గంగపురి రైస్ మిల్లు మూలం మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో మూగజీవాలకు మండల పశు వైద్యాధికారి మనీషా పటేల్ శుక్రవారం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వ్యాధి నిరోధక టీకాలను వేశారు. వ్యాధి సోకిన మూగజీవాల్లో కంటి ముక్కు నుండి స్రావాలు రావడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరమంతా బొబ్బులు, మేత సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. పశు పోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత టీకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ పశు వైద్య సహాయక సిబ్బంది రమణయ్య, పశుపోషకులు తదితరులు ఉన్నారు.
సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శుక్రవారం భోజన విరామ సమయంలో మండలంలోని రేచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మా కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని కళాశాల ప్రత్యేకతలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి మధుసూదన్, కళాశాల అధ్యాపకులు శ్రీధర్, రాజు, రాజేందర్, రాజ్ కుమార్, రజిత, నాగేశ్వరి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే, టీటీడీ నుంచి హాజరైన అధికారులు స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని పండితులు అట్టహాసంగా నిర్వహించారు.
రాంనగర్ ఫిబ్రవరి 7 : యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం చొప్పదండి మండలం రుక్మాపూర్ కేజీబీవీ పాఠశాలలో మత్తు పదార్థాల పైన నిర్వహించిన అవగాహనా సదస్సులో ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వలన విద్యార్థుల భవిష్యత్తు అందకారమయం అవుతుందని, జీవితంలో నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారని విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగి భవిష్యత్తు కాపాడుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు పాఠశాలలో కాన్షియస్నెస్ క్లబ్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో బాలరక్షక్ కో ఆర్డినేటర్ సాయి కిరణ్, నషా ముక్త్ భారత్ మాలతి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎక్సైజ్ సిబ్బంది అశోక్, ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | అరవింద్ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BC Reservations | రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది బీసీ నామినేషన్లు..!