నమస్తే నెట్వర్క్, జూలై 23: కాంగ్రెస్ చెప్తున్నట్టుగా 3 గంటల కరెంటు ఇస్తే రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని పలువురు బీఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న 24 గంటల కరెంటుతోనే 3 పంటలు పండుతాయని వారు స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల ఆదివారం రైతు సభలు నిర్వహించి కాంగ్రెస్ 3 గంటల కరెంటు విధానాన్ని ఎండగట్టారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి, హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో జరిగిన రైతు సభల్లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లి మండల కేంద్రాలు, పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో జరిగిన రైతు సభల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని తీర్మానాలు చేశారు. పంట నష్టపరిహారం విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎలిగేడులో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.