Viral Video | పాము పేరు చెబితేనే చాలామంది భయపడిపోతారు. అలాంటిది పాము ఎదురుగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఆమడదూరం పారిపోతారు! అది ఒక ప్రాణేనని.. దానికి నొప్పి, బాధ ఉంటాయని చాలావరకు ఆలోచించరు కదా! కానీ కరీంనగర్‌కు చెందిన పలువురు జంతు ప్రేమికులు మాత్రం పాము మీద కూడా జాలి చూపించారు.
కమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న ఓ పామును గమనించిన జంతు ప్రేమికులు దాన్ని వెంటనే పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అక్కడి పశువైద్యులు కూడా వెంటనే స్పందించి.. పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి దాన్ని బతికించారు. ప్రస్తుతం పాము పరిస్థితి మెరుగ్గా ఉందని పశు వైద్యులు చెప్పారు.
ఇలా గతంలో కూడా పాముకు ఆపరేషన్ చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవల మంగళూరులో ప్లాస్టిక్ మూత మింగి తీవ్ర అవస్థ పడుతున్న పాముకు పశు వైద్యులు చికిత్స అందించారు. ముందుగా పాము పొట్టకు ఎక్స్‌రే తీసి.. ప్లాస్టిక్ మూత మింగినట్లు గుర్తించారు. ఆ తర్వాత పాముకు మత్తుమందు ఇచ్చి.. ఆక్సిజన్ మాస్క్ ఇచ్చి మరీ ఆపరేషన్ చేసి దాని ప్రాణాలు కాపాడారు. దాదాపు 15 రోజుల కింద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
On 11-06-2023 A cobra was presented with a history of obstruction in GIT at Mangalore, Dakshina Kannada district. which was surgically removed by Dr. Yashaswi Naravi.#Dakshinakannada #surgery pic.twitter.com/BvhEnmMPPL
— Dept of Animal Husbandry and Veterinary services (@AHVS_Karnataka) June 11, 2023