Karimnagar Bandh | కరీంనగర్ కార్పొరేషన్/గంగాధర: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ గూండాల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క అరెస్టు చేసి టీటీసీకి తరలించారు.
శనివారం ఉదయం నుంచే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులను అరెస్టు చేశారు.
మరోవైపు కరీంనగర్లో నిర్వహిస్తున్న బంద్‌లో పాల్గొనేందుకు గంగాధర మండలం బూరుగుపల్లి నుంచి బయల్దేరిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని బూరుగుపల్లిలోని నివాసానికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. ఇక కరీంనగర్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
నగరంలో వ్యాపార వాణిజ్య సంఘాలు సచ్చంధంగా గా బందును పాటిస్తున్నాయి నగరంలోని అనేక ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్యాలని మూసి ఉన్నాయి మరోవైపు పోలీసులు రోడ్లపైకి వస్తున్న టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులకు కొనసాగిస్తున్నారు