Karepally | కారేపల్లి, అక్టోబర్ 3 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మండల కేంద్రంలోని ఆమె నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు,ఆధిపత్య పోరు,స్థానిక నాయకత్వ సమన్వయ లోపం,పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం,రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరులలో తాను ఒకదానినని కాబట్టి తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.ఐదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి మండలంలో మేజర్ గ్రామపంచాయతీ ఐన కారేపల్లి సర్పంచ్ గా పంచాయతీ అభివృద్ధికి నా వంతు కృషి చేశానన్నారు. ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల వల్లే తాను పార్టీ మారుతున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది మరి కొద్ది రోజుల్లో చెప్తానని వెల్లడించారు.