దుమ్ముగూడెం, అక్టోబర్ 19: తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావొద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీ లో ఉన్న కన్నాయిగూడెం గ్రామస్థులు మరోసారి రాస్తారోకో చేశారు. ఆదివారం మధ్యా హ్నం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ నిలిపివేయడంతో ప్రయాణికులు, పర్ణశాలకు వెళ్లే రామభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయంపై వారం రోజుల క్రితం కన్నాయిగూడెంతోపాటు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఇసుక లారీలు దండెత్తడం వల్ల రోడ్లు ధ్వంసమై తాము ప్రమాదాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.