ఉద్యమకారులకిచ్చిన హామీల అమలేది.. 29లోగా స్పష్టమైన ప్రకటన చేయాలి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లోపించిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి ధ్వజమెత్తారు.
- లేకుంటే 30న అసెంబ్లీని ముట్టడిస్తాం
- టఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కనకం
కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 25 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి లోపించిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి ధ్వజమెత్తారు. స్వరాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన ఉద్యమకారులకు సముచిత గౌరవం కల్పిస్తామంటూ వాగ్దానం చేసి మాటతప్పిందని మండిపడ్డారు.
కరీంనగర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీల అమలుకోసం రాష్ట్రవ్యాప్తంగా టఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్న సమయంలో ఉద్యమకారుల గుర్తింపు కోసం 30 రోజుల్లో కమిటీలు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. ఉద్యమకారులకిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 29లోగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 30న అసెంబ్లీని అష్టదిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భోజనాలు వడ్డిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

