రెంజల్ : నిజామాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి నదిలో సైతం వరద భారీగా పోటెత్తుతున్నది. భారీ వరదలతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద పురాతన శివాలయం దాదాపు నీటమునిగింది. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలో మొదట ప్రవేశించేది రెంజల్ మండలం కందకుర్తి వద్దే.
ఇక్కడ గోదావరితోపాటు హరిద్రా, మంజీర నదులు కలిసేది కూడా ఇక్కడే. ఈ త్రివేణి సంగమ పుణ్యక్షేత్రం వద్ద ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండగా ఆలయం నీటమునిగింది. పర్వదినాల్లో భక్తులు చుట్టూ పక్కల వారే కాకుండా తెలంగాణ రాష్ట్రం నలుమూలలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.