కామారెడ్డి, జనవరి 2 : మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ కార్మికులు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శానిటేషన్, నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాల్లో 380 మంది కార్మికులు 30 ఏండ్లుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్నారని తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వేతనాలు చెల్లించలేద ని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందనకు వినతిపత్రం అందజేశారు.
తనపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా నూతనకల్‌కు చెందిన కాటూరి రాము గురువారం పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తమను విద్యాశాఖలో విలీనం చేయాలని మోడల్ స్కూల్, హాస్టళ్లలోని నాన్ టీచింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, హాస్టల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైఫాబాద్‌లోని విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేశారు.